22-03-2025 10:10:53 PM
రామగిరి (విజయక్రాంతి): మండలంలోని బేగంపేట గ్రామంలో మోటారు చెడిపోయి ఊదరి వాడ, హనుమాన్ దేవాలయ సమీపంలోని వాడల్లో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వాడ ప్రజలు దాసరి శివ దృష్టికి తీసుకు వెళ్లగా మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లిన శివ మంత్రి ఆదేశాలతో శివ వాడలో నూతన మోటారును కొనుగోలు చేసి నీటి సరఫరాని పునరుద్ధరించారు. ఈ వేసవిలో తాగునీటి కష్ణలను తీర్చిన శివపై హర్షం వ్యక్తం చేసిన వాడ ప్రజలు శివను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ... మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో మోటారును అందించామని సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు శివ వాడ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.