- వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు
- మామిడిపల్లి ఘాట్ రోడ్డు నిర్మాణానికి సత్వర చర్యలు
- ‘విజయక్రాంతి’ కథనాలకు స్పందన
వేములవాడ, కోనరావుపేట, జనవరి 28: ఆలయ సంప్రదాయాల ప్రకారమే భక్తు లకు దర్శనం కల్పిస్తున్నామని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా సకల సౌకర్యాలు చేస్తున్నామని వేముల వాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ‘విజయ క్రాంతి’ దినపత్రికలో ‘దర్శనం అయ్యేనా’ అనే శీర్షిక ప్రచురితం కావడంతో స్పం దించిన ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్పందించారు.
దేవస్థానము నందు సుప్రభాతం అనం తరం ప్రాతఃకాల పూజకు భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడము జరుగు తుంది. భక్తులు దర్శించుకొని తదుపరి శ్రీస్వామి ముందు అనాధి నుండి భక్తులకు శ్రీస్వామి వారి గర్భాలయ సర్వ దర్శనం జరుగుచున్నది. ఈ క్రమములో భక్తులు శ్రీలక్ష్మిగణపతి స్వామి వారిని, శ్రీ అమ్మవా రిని దర్శంచుకోవడము ఈ ఆలయ సాంప్ర దాయ ప్రకారము అనవా యితి కలదు.
తదుపరి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామి వారి కి అర్చకులచే ప్రాతఃకా ల పూజ జరుగును. ఆ సమయము నుండి భక్తుల కు ఏలాంటి గర్భాలయ దర్శ నాలు జరుపించ బడవు. ఇది సనాతన కాలం నుండి వస్తున్న సాంప్రదా యము అంతేకాని సుప్రభాతానంతర సర్వ దర్శనాలలో ఎవ్వరికి కూడ ప్రత్యేక దర్శనా లు గాని వి.ఐ.పి దర్శనాలు కాని అర్చనలు గాని జరిపించబడవన్నారు.
కోనరావుపేట లో..
ఈనెల 29 జరిగే మాఘ అమావాస్య జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యా లు చేశామని వేములవాడ రాజన్న ఆలయ వినోద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ‘విజ యక్రాంతి’ దినపత్రికలో స్వామి ‘దర్శనానికి దారేది’ అనే శీర్షికన ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు.
జాతరను పురస్క రించుకొని గుట్టపై ఉన్న స్వామివారిని దర్శిం చుకునేందుకు ఘాట్ రోడ్డు నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఘాట్రోడ్లో ఉన్న పెద్ద బండ రాళ్ళను తొలగించి వాహ నాల రాకపోకలకు ఏర్పాటు చేసేలా అధికా రులు దగ్గరుండి చర్యలు తీసుకుంటున్నారని ఆలయ ఈవో అన్నారు.