calender_icon.png 7 October, 2024 | 3:57 PM

యాదాద్రి సన్నిధిలో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం

07-10-2024 01:21:59 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి ) : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు సోమవారం శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజ అర్చనలు పారాయణములు గాయత్రీ జపములు  లలిత సహస్రనామార్చన మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిపారు. సాయంకాలం శ్రీదేవి  నవావరణ  పూజ  సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు తీర్థ ప్రసాద వితరణ జరుగును.