యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి ): యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు శుక్రవారం మహిషాసుర మర్దినీ దేవీ అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజ స్థాపితదేవత హవనం అర్చనలు పారాయణములు గాయత్రీ జపములు లలిత సహస్రనామార్చన మరియు మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిగినది. సాయంకాలం శ్రీదేవీ చతుషష్టి ఉపచార పూజ సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు సువాసినీ పూజలు తీర్థ ప్రసాద వితరణ జరుగును.