calender_icon.png 13 January, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యూబాలో అంధకారం

20-10-2024 03:02:23 AM

పవర్ గ్రిడ్ వైఫల్యంతో అలుముకున్న చీకట్లు

హవానా, అక్టోబర్ 19: క్యూబాలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్‌లలో ఒకటి విఫలం కావడంతో జాతీయ పవర్ గ్రిడ్  ఒక్కసారిగా కుప్పకూలిం ది. దీంతో ఈ ద్వీప దేశంలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో తీవ్ర విద్యుత సంక్షోభం తలెత్తినట్లు ఆ దేశ విద్యుత్ శాఖమంత్రి తెలిపారు. విద్యు త్ లేకపోవడంతో అత్యవసరం కాని పరిశ్రమలను మూసేసి కార్మికులను ఇళ్లకు పంపించారు.

స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాగా పవర్ ప్లాం ట్ విఫలమవడానికి కారణాలు తెలియరాలేదు. విద్యుత్‌ను తిరిగి పునరు ద్ధరించేవరకు విశ్రాంతి లేదని క్యూబా అధ్యక్షుడు మిజిల్ డియాజ్ కేనల్ పేర్కొన్నారు. తీవ్రమైన ఉక్కపోతతో కోటికి పైగా ఉన్న ద్వీపదేశ వాసులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.