calender_icon.png 3 April, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ర్టంలో కాంగ్రెస్ చీకటి పాలన

11-12-2024 01:31:27 AM

* తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖతం

* మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు

* ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు పాలాభిషేకం

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, డిసెంబర్ 10: రాష్ర్ట సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, ప్రజల మనోభావాలను సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బ తీశారని, రాష్ర్టంలో చీకటి పాలన నడుస్తున్నదని మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టారు. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రజల తల రాతలను మార్చాల్సిన ప్రభుతం విగ్రహాలను మారుస్తుండటం దురదృష్టకరమని అన్నారు.

కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి జోగు రామన్న క్షీరాభిషేకం చేశారు. ప్రభుత వైఖరి పట్ల తీవ్ర అసహ నం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో మం డల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. నిజామామాద్‌బీఆర్‌ఎస్ కార్యాలయంలో తెలంగాణా తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మేల్సీ వీజీగౌడ్ క్షీరాభిషేకం చేశారు.