calender_icon.png 31 October, 2024 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదురుతున్న ‘కన్వర్’ రగడ

20-07-2024 12:05:00 AM

  1. వివాదాస్పదం అవుతున్న ఉత్తర్వులు
  2. ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల విమర్శలు
  3. పాటించాల్సిందే అంటున్న సీఎం
  4. రాజ్యాంగంపై దాడి అన్న ప్రియాంక

న్యూఢిల్లీ, జూలై 19: కన్వర్ యాత్ర కోసం యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీ వ్ర వివాదాస్పదం అయ్యాయి. ప్రతిపక్షాలతో పాటు బీజేపీ మిత్ర పక్షాలు కూడా అభ్యంతరం చెబుతున్నాయి. ముజఫర్‌నగర్ పోలీ సుల ఆదేశాలను తప్పుబడుతూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగం మీద దాడే అన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

కులం పేరు చెప్పి మనుషులను విడదీయడం నేరం అని, ఇది లౌకిక స్ఫూర్తిగా వ్యతిరేకం అన్నారు. వెంటనే ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఇంతటి వివాదాస్పద ఆదేశాలను జారీ చేసిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మన దేశ రాజ్యాంగం దేశంలోని  ఏ వ్యక్తి కూడా కులం, మతం, ప్రాంతం, భాష ప్రాతిపదికన వివక్షకు గురవకుండా ఉండేందుకు కఠిన చట్టాలు చేసిందని, కానీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కన్వర్ యాత్ర మార్గదర్శకాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. కన్వర్ యాత్రలో హోటల్ యజమానులు యజమానుల పేర్లు ప్రదర్శించాలన్న ఉత్తర్వులపై ప్రతిపక్షాలతో పాటు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీ (యూ), లోక్‌జన్ శక్తి (రామ్ విలాస్) పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

అసలేంటా ఉత్తర్వులు.. 

ఏటా యూపీలో జరిగే కన్వర్ యాత్ర ఈ సారి కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. యాత్ర మార్గంలో ఉండే హోటళ్ల వారు.. హోటల్ ఎవరికి చెందిందో చెబుతూ వారి పేరు మీద నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల మీదే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

తగ్గేదే లేదు.. ఆదేశాలు పాటించాల్సిందే 

కన్వర్ యాత్ర మార్గదర్శకాలపై యూ పీ సీఎం యోగి స్పందించారు. భక్తులు శాఖాహార హోటల్స్ ఏవో తెలుసుకోవడం సులభం అవుతుందని, భక్తుల కోసమే ఇటువంటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేసేవారు కూడా ఈ ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలన్నారు. కొంత మంది యజమా నులు శాఖాహారం అని బోర్డులు పెట్టి మాంసాహారం విక్రయిస్తున్నారని మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్ ఆరోపించారు.