calender_icon.png 9 January, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా.. మెయిన్ రోడ్డు కబ్జా

07-01-2025 12:00:00 AM

  • చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు

ప్రయాణికుల నుంచి వెళ్లువెత్తుతున్న విమర్శలు

మంథని, జనవరి 6 (విజయ క్రాంతి): మంథని నడిబొడ్డున... మెయిన్ రోడ్డును దర్జాగా కబ్జా చేస్తున్నారు. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు... అన్న చందంగా మునిసిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్డు ఆక్రమణ కు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మం తిని బస్టాండ్ సమీపంలోనే ప్రధాన రహదా రిపై పండ్ల వ్యాపారులు రోడ్డును ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. 

ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే ఆర్టిసి బ స్సులకు, లారీలకు, కార్లు, ఇతర ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగంగా ప్రధాన రహదారిని ఆక్రమిం చుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని  మున్సిపల్ అధికారుల పై ప్రయాణికులు, పట్టణ ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఇదేవిధంగా చోద్యం చూస్తే మునుమందు ప్రధాన రోడ్డు మరింత కబ్జాకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికా రులు జోక్యం చేసుకొని రోడ్డు ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.