30-03-2025 08:31:33 PM
భద్రాచలం (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ భద్రాచలం మండలం అధ్యక్షులుగా దారపునేని రాంబాబుని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు రేపూరి కోటేశ్వరరావు నియమించారు. నియామక పత్రాలను ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య చేతులు మీదుగా రాంబాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరాల రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మల వెంకటేశ్వరరావు, యూత్ నాయకులు వరుణ్, తదితరులు పాల్గొన్నారు.