calender_icon.png 9 January, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఏపీ బస్తా @ 1350

02-01-2025 02:12:14 AM

  1. పంటల బీమా కేటాయింపులు పెంపు 
  2. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ, జనవరి 1: కొత్త ఏడాది మొదటి రోజే సమావేశమైన కేంద్ర క్యాబినెట్ దేశంలోని అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యో జన (పీఎంఎఫ్‌బీవై)పై చర్చ జరిగింది.

ఈ పథకం రైతుల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపిన కేంద్రం.. ఈ పథకం కింద కేటాయింపులను రూ. 69,515 కోట్లకు పెంచాలని ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతే కాకుం డా 50 కేజీల డీఏపీ బస్తాను రూ. 1,350కే అన్నదాతలకు అందించేందుకు రూ. 3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

వేరే దేశాల్లో 50 కేజీల డీఏపీ బస్తా రూ. 3వేల పైనే ఉందని ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకం కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

అన్నదాతలకు అంకితం 

2025 సంవత్సరం మొదటి రోజునే కేంద్ర క్యాబినెట్ అన్నదాతలకు శుభవార్త చెప్పిందని, అన్నదాతల మేలు గురించి ఆలోచించిన ప్రధాని మోదీకి మంత్రి అశ్వినీ వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వెలువరించారు. ‘ఈ భేటీలో అన్నదాతల సంక్షేమం గురించి చర్చ జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకాలను 2025-26 వరకు పొడిగించాం.

15వ ఆర్థిక సంఘం కాలానికనుగుణంగా పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. పంట ల బీమా పథకాల అమలులో అధునాతన సాంకేతికతను ఉపయోగించేందుకు రూ. 824.77 కోట్ల తో ప్రత్యేక ఫండ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెక్నాలజీ వినియోగంతో పంట నష్టం అంచనాలను త్వరగా తెలుసుకునేందుకు వీలు పడుతుంది’ అని తెలిపారు. 

రైతులు తేల్చి చెప్పారుగా.. 

మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్యాబినెట్ నిర్ణయాలను వెలువరిస్తున్నపుడు కొంత మంది విలేకరులు అన్నదాతల ఆందోళన గురించి ప్రశ్నించారు. అన్నదాతలు అంతలా ఆందోళన చేస్తున్నా కేంద్రం ఎందుకు వారి డిమాండ్లను తీర్చలేకపోతుందని ప్రశ్నించారు. మంత్రి మాట్లా డుతూ... ‘మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో రైతులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. నిజమైన సంక్షేమం ఏమిటో తేల్చిచెప్పారు’ అని మంత్రి తెలిపారు. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యుబీసీఐ పథకాల నిధుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

హర్షం వ్యక్తం చేసిన ప్రధాని

క్యాబినెట్ నిర్ణయాలనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పం దిస్తూ ‘రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. కొత్త సంవత్సరంలో మొదటి క్యాబినెట్ భేటీని అన్నదాతల శ్రేయస్సుకు అంకితం చేశాం. అన్నదాతలకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు.