హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అభ్యర్థులకు నవంబర్ 8 నుంచి 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు టీజీపీఎస్‌సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు 1 : 2 జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 2022లో ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్ధేశిత తేదీల్లో నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. పీడబ్ల్యూడీ అభ్యర్థుల 1 : 5 జాబితానూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వివరా ల కు టీజీపీఎస్సీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.