calender_icon.png 18 January, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేంజరస్ రన్‌వేలు

25-07-2024 01:40:48 AM

ప్రమాదాలకు నిలయంగా టేబుల్‌టాప్ ప్రాంతాలు

భారత్‌లోనూ ఇలాంటివి 5 విమానాశ్రయాలు

కోజికోడ్, మంగళూరులో గతంలో భారీ ప్రమాదాలు

న్యూఢిల్లీ, జూలై 24: బుధవారం ఖాట్మండు ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదంతో మళ్లీ టేబుల్‌టాప్ రన్‌వేలపై చర్చ మొదలైంది. ఎత్తున ప్రాంతాల్లో ఉండే ఇలా ంటి విమానాశ్రయాల్లో ఎక్కువ ప్రమాదాలు జరగుతూనే ఉంటాయి. కఠినమైన పరిస్థితుల్లో విమానాన్ని టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేయడం పైలట్లకు కత్తిమీద సాము లాంటి విషయం. మనదేశంలోనూ ఇలాంటి రన్‌వే లు ఉన్నాయి. భారత్‌లోని సిమ్లా, కోజికోడ్, మంగళూరు, లెంగ్‌పుయీ (మిజోరం), పాక్యాంగ్ (సిక్కిం) ప్రమాదకర రన్‌వేలుగా ఉన్నాయి. కోజికోడ్, మంగళూరులో భారీ విమాన ప్రమాదాలు గతంలో జరిగాయి. 

మేజర్ ప్రమాదాలు

  1. 2010 మే 22న దుబాయి నుంచి వస్తు న్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళూరులో క్రాష్ అయింది. ఈ ప్ర మాదంలో ఆరుగురు సిబ్బంది సహా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. 
  2. 2020 ఆగస్టులో కోజికోడ్ టేబుల్ టాప్ రన్‌వేపై అదే రకమైన విషాదం చోటుచేసుకుంది. కొవిడ్ నేపథ్యంలో వందేభా రత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుం చి వస్తున్న విమానం రన్‌వేపై దిగుతూ నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ఇద్దరు పైలట్లతో సహా 19 మంది ప్రయాణీకులు మరణించారు. 
  3. టేబుల్ టాప్ రన్‌వేలపై ప్రమాదాల్లో పోర్చుగల్‌లోని మదైరా ఎయిర్‌పోర్ట్‌లో 1977లో విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనలో 131 మంది చనిపోయారు.  

మూడు దశాబ్దాల్లో 27 ప్రమాదాలు 

హిమాలయాల్లో నెలవైన నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నా యి. అక్కడి కఠిన వాతావరణ పరిస్థితులతో పాటు టేబుల్ టాప్ రన్‌వేలపైనే ఆధారపడటం వల్ల గత 24 ఏళ్లలో విమాన ప్రమా దాల్లో 350 మంది మరణించారు. గత మూడు దశాబ్దాల్లో అత్యధికంగా 27 విమాన ప్రమాదాలు సంభవించాయి. వాతావరణ పరిస్థితులు కూడా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రభావం చూపిస్తాయి. కొండలు, శీ తల వాతావరణం, అధిక సాంద్రత కలిగిన గాలిలో విమాన ప్రయాణాలు ప్రమాదకరం గా మారే అవకాశం ఉంది. అందుకే నేపాల్ లో ఎక్కువ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.