16-03-2025 08:16:14 PM
పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు..
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారి పక్కనే కాలువపై గుంత ప్రమాదకరంగా తయారైంది. గత నెల రోజుల క్రితం ఈ నాలపై ఇదే గుంతలో లారీ దిగబడి పెద్ద ప్రమాదం తప్పింది. అయినా మున్సిపల్ అధికారులు నాలాపై కప్పు ఏర్పాటు చేయడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి దుర్ఘటన జరగక ముందు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తక్షణమే పనులు చేపట్టి పూర్తిచేయాలని సంబంధిత అధికారులను బిజెపి సీనియర్ నాయకులు పోతరవేన క్రాంతి కోరారు.