calender_icon.png 21 December, 2024 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో ఘరానా మోసం

07-09-2024 12:00:00 AM

  1. వికారాబాద్‌లో 30ఎకరాల భూమి ఉందని చెప్పి.. 
  2. బాధితుల నుంచి రూ.4కోట్ల వరకు వసూలు 
  3. డబ్బు తిరిగి ఇచ్చేయాలనడంతో చేతులెత్తేసిన ‘వీఒన్ ఇన్ఫ్రా’ సంస్థ

కూకట్‌పల్లి,  సెప్టెంబర్ 6: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఒన్ ఇన్ఫ్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సర్ధార్ పటేల్ నగర్‌లో ఈ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఎండీ సురేష్ కుమార్ ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్‌లో తమ సంస్థకు సంబంధించిన 30 ఎకరాల భూమి ఉందని చెప్పి బాధితులకు గుంట చొప్పున 5లక్షల రూపాయలకు నకిలీ రిజిస్ట్రేషన్ చేసి 25 నెలల కాలవ్యవధిలో.. తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించిన తర్వాతనే మరలా భూమి పత్రాలను వెనక్కి తీసుకుంటానని నమ్మించి దాదాపు రూ.నాలుగు కోట్ల మేర కలెక్ట్ చేసిన అనంతరం ప్లేటు ఫిరాయించాడు.

ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద డబ్బులు తీసుకుని ప్రతినెల నాలుగు శాతం వడ్డీ ఇస్తామని చెప్పి  భారీ మోసానికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ డబ్బు తమకు ఇవ్వాలని బాధితులు అడగటంతో స్పందించకపోవడంతో బాధితులు శుక్రవారం కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 80మందికి పైగా సురేష్‌పై ఫిర్యాదు చేశారు.  బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.