రేవల్లి, జనవరి 30 : రేవల్లి మండల పరిధి లోని చీర్కపల్లి గ్రామ బస్ స్టాండ్ సమీపంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి పై విద్యుత్ అధికారులు గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాద భరీతంగా మారింది. సాధారణంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు మూగ జీవాలు, మనుషుల అందకుండా బాగా ఎత్తు దిమ్మేను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కానీ అందుకు విరుద్ధంగా మూగ జీవాలు, మనుషులకు అందె స్థాయిలో ఏర్పాటు చేయడం పలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ అక్కడి నుండి తొలగించి ప్రమాదం జరగని స్థలం లో ఏర్పాటు చేయాలనీ గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయమై మండల విద్యుత్ అధికారి శ్రీశైలం ను వివరణ కోరగా గత కొన్నేళ్ల క్రితం ఈ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారని, తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది కాదు, ప్రమాదాల నివారణకై వెంటనే దానికి కంచెను ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు,