వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు...
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కల్వర్టు ప్రమాదకరంగా తయారైంది. నాలుగు రోజుల క్రితం అంబేద్కర్ చౌరస్తా మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్న డ్రైనేజీ లో ఎరువు బస్తాల లారీ వెళ్లడంతో డ్రైనేజీ పూర్తిగా శిథిలమవడం జరిగింది. దానివల్ల వాహనదారులు అందులో పడే అవకాశం ఉన్నందున వెంటనే మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.