calender_icon.png 26 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13.5 కి.మీ వద్దే.. డేంజర్ జోన్

26-02-2025 01:13:27 AM

  1. బురదను కదిలిస్తే సొరంగం ఇక అంతే!
  2. గంట గంటకు పెరుగుతున్న నీటి ఊట, బురద 
  3. సహాయక చర్యల్లో ఇప్పటికే 580మంది
  4. మరికొందరిని రప్పించే ఏర్పాట్లు
  5. వారి ప్రాణాలను కాపాడుతాం: మంత్రుల బృందం

నాగర్‌కర్నూల్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు తప్పిపోగా వారిని కాపాడే ప్రయత్నాలకు బురద  అడ్డంకిగా మారిం ది. ఆ బురదను కదిలిస్తే సొరంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని రెస్క్యూ టీమ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిమిషానికి 3నుంచి 5వేల లీటర్ల ఊట నీటితో పాటు లూజ్ మట్టి, బురద సొరంగం పైకప్పు నుంచి వచ్చి చేరుతోంది. కాగా 13.50 కి.మీ. వరకు చేరిన మట్టి నాలుగవ రోజుకు 12 కి. మీ వరకు వచ్చి చేరింది. దీంతో లోకో ట్రెయిన్ ఘటన స్థలికి వెళ్లలేక సహాయక చర్యలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రెస్క్యూ టీం కన్వేయర్ బెల్ట్‌పై కాలినడకన వెళ్లి సహాయక చర్యలను పరిశీలిస్తున్నా రు. ప్రాజెక్టు సొరంగంలో సుమారు 6 మీటర్ల మేర ఎత్తు బురద పేరుకుపోయి మొత్తంగా ప్రాజెక్టు సొరంగంలో ప్రస్తుతం 10వేల క్యూబిక్ మీటర్ల బురద మట్టి పేరుకు పోయిందని చెబుతున్నారు.

సొరంగంలోకి చేరుతు న్న నీటి ఊటను డి వాటరింగ్ చేయడంతో పాటు బురదను కూడా తొలగించే ప్రయత్నం చేస్తే మట్టి దిబ్బలు మరింత కూలి ప్రమాదస్థాయి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని రెస్క్యూ టీం అభిప్రాయపడుతున్నారు. 8 మంది కార్మికులను కాపాడేందుకు సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ టీంల కు భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని అధిగమించేందుకు మట్టి దిబ్బలు కూలి పడకుండా జాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

ఈ కారణంగానే టన్నెల్ బోరింగ్ మిషన్ అవతలి వైపు ఉన్నారని అనుమానిస్తున్న కార్మికులను చేరలేకపోతున్నారు. సుమారు వేల టన్నుల బరువు గల టీబీఏమ్ మిషన్ సైతం ప్రమాదం దాటికి వంద మీటర్ల వెనక్కి తోసుకొచ్చిందని రెస్క్యూ టీమ్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేసేందుకు ఈ సవాళ్ళను ఎదుర్కొలేకపోతున్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ రెస్క్యూ టీమ్స్ వద్ద రివ్యూ నిర్వహించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

ప్రస్తుతం సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రాతో పాటు ర్యాట్ హోల్ మైన్స్ రెస్క్యూ టీమ్, నేవీ, మేఘ, ఎల్‌అండ్‌టీ రెస్క్యూ ఆపరేషన్లలో ఉమ్మడిగా ఒక టీంగా ఏర్పడి కార్మికుల ప్రాణాలను ఎలా కాపాదాలనే సమాలోచన చేస్తున్నారు.

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం 14 కి.మీ ఉపరితలం పైభాగంలో నిత్యం నీటి ఊటతో జాలువారే  మల్లెల తీర్ధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే సొరంగంలో నీటి ఊట అదుపులోకి రావడం లేదని భావిస్త్తున్నారు. అయినా కార్మికులను కాపాడేందుకు వెనకడుగు వేసేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 

రంగంలోకి మరింత మంది నిపుణులు!

బురద మట్టిని నీటి ఊటను అడిగమించి కార్మికులను కాపాడేందుకు రంగం లోకి మరింత మంది నిపునులను రప్పిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. రిమోట్ సెన్సార్ ఏజెన్సీ, బార్డర్ హైవే ట్రాన్స్‌పోర్ట్  అతారిటీ, నేవి ఎక్స్‌పర్ట్స్, అర్మీ చీఫ్ జనరల్ కూడా వస్తున్నట్లు ప్రకటించారు. కాగా ప్రస్తుతం సొరంగ మార్గం అడ్డుగా ర్యాట్ హోల్ మైన్స్ చేత అనువైన మార్గం గుండా చొరబడి కార్మికుల వద్దకు చేరుకునే ప్రత్తిపాదనకు వచ్చారు.

దీంతో పాటు కన్వీయర్ బెల్ట్ మరమ్మతు జరిపించి గంటకు 800 క్యూబిక్ మీటర్లు బురద మట్టిని బయటికి తీసుకు వచ్చే ప్రతిపాదన సిద్ధం చేశారు. మరోవైపు జార్ఖండ్ రాష్ట్ర ప్రతినిధి అవినాష్ అనే వ్యక్తి క్షేమం సమాచారం తెలుసుకునేందుకు ఘటనాస్థలికి వచ్చారు. సొరంగ మార్గంలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక సంస్థ గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని స్థానిక కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మట్టిని బయటకు తీసే బాధ్యత సంబంధిత కంపెనీ యజమానికి అప్పగించడంతో 42 గంటల్లోనే మట్టిని బయటికి తీస్తానంటూ హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణా శాఖ స్పెషల్ సిఎస్ అర్వింద్‌కుమార్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ ఈ శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజీ చౌహన్, ఎల్‌అండ్‌టీ టన్నెల్ రంగ నిపుణులు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి దుర్గటనలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, జేపీకి చెందిన పంకజ్ గౌర్, నేవీ కి చెందిన మరికోస్, ప్రసాద్, ఆర్మీ కల్నల్ వికాస్, కల్నల్ సురేష్, మోర్త్ డైరెక్టర్ అన్షు కల్కు, ఎన్ హెచ్ డి సి ఎల్  (నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా డెవలపర్) ఎన్డీఆర్‌ఎఫ్  కమాండెంట్ ప్రసన్న, అగ్నిమాపక శాఖ రీజినల్ ఫెయిర్ ఆఫీసర్ సుధాకర్ రావు, హైడ్రా కు చెందిన పాపయ్య, ఎస్‌సీసీఎల్ అధికారి సదానందం, ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ ర్యాట్ మైనర్స్ గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, నవయుగకు చెందిన జేవిఎల్‌ఎన్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.