calender_icon.png 17 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్గిపుల్లతోనే ప్రమాదం!

17-11-2024 02:19:16 AM

షార్ట్ సర్యూట్ వల్ల కాదు యూపీ అగ్నిప్రమాదపై 

వాస్తవాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి ప్రాథమిక దర్యాప్తులో 

మరిన్ని షాకింగ్ విషయాలు మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున 

పరిహారం ప్రకటించిన సీఎం

రాష్టపతి, ప్రధాని దిగ్భ్రాంతి 

అగ్ని ప్రమాదం జరిగి పది మంది శిశులు ప్రాణాలు కోల్పోయిన అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ బాధను భరించే శక్తి వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. 

లక్నో, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్ ఝాన్సీ పట్టణంలో లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది నవజాత శిశువులు శుక్రవారం సజీవదహన మైన కేసులో కొత్త విషయం  వెలుగులోకి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమా దం జరిగిందని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పగా అది అవాస్తవమని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. హమీన్‌పూర్ కు చెందిన భగవాన్ దాస్ కుమారుడు అనారోగ్యానికి గురవ్వడంతో ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో అక్కడే ఉన్న భగవాన్ ఓ నర్సు నిర్ల క్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. డ్యూటీలో ఉన్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైపును బిగిస్తుండగా మరో నర్సు అగ్గిపుల్ల వెలగించగా మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. దీంతో నలుగు చిన్నారుల ను తీసుకుని తాను బయటికి పరుగులు తీసినట్టు వెల్లడించారు. మంటల కారణంగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆసుపత్రిలో ఉన్నవారు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటు జరిగి చాలామంది గాయపడ్డారని తెలిపారు. 

గడువు దాటి పరికరాలు

ఆసుపత్రిలో గడువు దాటిన అగ్నిమాపక పరికరాలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అగ్నిమాపక పరికరాల గడువు 2020లోనే తీరిపోయినప్పటికీ వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చలేదని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో ఫైర్ అలారం కూడా పని చేయలేదని గుర్తించారు. ఫైర్ సేఫ్టీ అలారం మోగకపోవడంతో సహాయక చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. దీంతో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించినట్టు వివరించారు.  

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్

ఈ ఘటనపై సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి విచారణకు అదేశించారు. విచారణకు సంబంధించిన నివేదికను శనివారం సాయంత్రం నాటికి తనకు అందించా లని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయాల పాలైన పిల్లల కుటుంబాలకు రూ.50వేల చొప్పున అందజేయనున్న ట్టు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై సమా జ్‌వాదీ పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. అవినీతికి, నిర్లక్ష్యానికి ఆసుపత్రులు నిలయంగా మారాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.