calender_icon.png 4 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేంజర్ వైరస్ కాంగ్రెస్

04-03-2025 01:34:43 AM

  1. సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి డౌన్
  2. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): కరోనా కన్నా ప్రమాదకర వైరస్ కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అసమర్థ సీఎం రేవంత్ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా వెలిగిన తెలంగాణ ను సీఎం రేవంత్ ఇప్పుడు అట్టడుగు స్థానానికి పడదోశారని ధ్వజమెత్తారు.

గతేడాది 10 శాతం జీఎస్టీ వసూలు నమోదైం దని, ఈసారి ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గు చేటన్నారు. సీఎం చెత్త నిర్ణయా లతోనే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే, రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయని దుయ్యబట్టారు.

సీఎం ‘డ్యామేజ్ డైవర్షన్’ కుట్రలు తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని హితవు పలికారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం లో సెంటీమీటరైనా తవ్వించడమైనా చేతకాని సీఎం, 12 కి.మీ టన్నెల్ పూర్తిచేసిన బీఆర్‌ఎస్ పాలనపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.

ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎస్‌ఎల్‌బీసీ పనులు మొదలుపెట్టి, నాలుగు రోజులు కాకముందే ఎనిమి ది మంది అమాయకుల ప్రాణాలను ఫణంగా పెట్టిన పాపం సీఎందేనని మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభు త్వం ఆ పనులకు రూ.3,300 కోట్లు ఖర్చు చేసిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 3,900 కోట్లు వెచ్చించిందన్నారు.

కాంగ్రెస్ సర్కారు కన్నా తమ ప్రభుత్వం రూ.600 కోట్లు ఎక్కువ ఖర్చుచేసిందని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వం పై సీఎం నిందలు వేయడం సీఎంకు తగదన్నారు. తమ ప్రభుత్వ హయాం లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 203 కి.మీ మేర సొరంగం తవ్వించామని, అయినప్పటికీ..

ఎస్‌ఎల్బీసీలో జరిగిన ప్రమాదం వంటిది ఒక్కటైనా జరగలేదన్నారు. సీఎం గల్లీ నుంచి ఢిల్లీదాకా కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టార ని, ఇప్పటికైనా సీఎం చేసిన తప్పును ఒప్పుకోవాలని హితవు పలికారు.