నిమ్స్ డైరెక్టర్ బీరప్ప
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): అనవసరంగా యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప సూచించారు. నిమ్స్‌లో జరుగుతున్న యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్‌నెస్ వీక్ (డబ్ల్యూఏఏడబ్ల్యూ)లో ఆయన మాట్లాడారు.
అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్, మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ, థెరప్యూటిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా సదస్సును నిర్వహించి ఈ అంశంపై అవగాహనకు ముందు కు రావడాన్ని ఆయన స్వాగతించారు. కార్యక్రమంలో నిమ్స్ డీన్ డా.లిజా రాజశేఖర్, ప్రొఫెసర్లు నవల్ చంద్ర, ఎంవీఎస్ సుబ్బలక్ష్మి, ఉమాబాల, కవిత, కె.పద్మజ, ఎస్.సుకన్య, భానుప్రసాద్, జుమాన, శశిధర్, పి.ఉషారాణి పాల్గొన్నారు.