calender_icon.png 2 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన కూడళ్లలో పొంచి ఉన్న ప్రమాదం

02-02-2025 12:25:12 AM

జీబ్రా క్రాసింగ్ లేక పాదచారుల అగచాట్లు.. స్పందించని అధికారులు 

కల్వకుర్తి, ఫిబ్రవరి 1: పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో  ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు రోడ్డు దాటేందుకు అనుకూలంగా జీబ్రా క్రాసింగ్లైన్ వేయడం మరిచారు. ఇవి లేకపోవడంతో పాదచారులు, పట్టణ, గ్రామీణ ప్రజలు రోడ్డు దాటాలంటే భయపడుతున్నారు.

 ప్రతినిత్యం వందల వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో  నిర్దిష్ట దిశలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అమర్చకపోవడంతో వాహన వాహనదారులకు సిగ్నల్స్ తికమక పెడుతున్నాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా  ఇష్టారీతిగా సిగ్నల్స్ ను  అతిక్రమించి రోడ్డు దాటుతు న్నారు.

దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ను నిర్దిష్ట దిశలో ఏర్పాటు చేసి కాలినడకన వెళ్లే వారికోసం జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.