చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. చుండ్రు వెంట్రుకల్లోనే కాదు, కనురెప్పలు, కనుబొమ్మల్లో కూడా వస్తుంది. కనురెప్పల వచ్చే చుండ్రును బ్లెఫా రిటిస్ అంటారు. దీనివల్ల తీవ్రమైన కంటి సమస్య, దురద, చికాకు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు కంటి ఆరోగ్యానికి ప్రమాదకరం.. ఎందుకంటే ఇది కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనురెప్పల మీద చుండ్రు ను వైద్యపరంగా బ్లెఫారిటిస్ అంటారు.
ఈ సమస్య వల్ల కళ్ల మంటలు, దురద వస్తుంది. అలాగే కంటి చికాకు, ఇన్ఫెక్షన్, కార్నియ ల్ దెబ్బతినడానికి కూడా కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాంటాక్ట్ లెన్స్‌లు ధరించే వ్యక్తులు ఈ సమస్యతో బాధపడవచ్చు. కనురెప్పలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పాత మేకప్ ఉపయోగించవద్దు. పడుకునే ముందు కంటి మేకప్ తొలగించుకోవాలి. కనుబొమ్మల మీద చుండ్రు సమస్య నివారించడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు.