calender_icon.png 25 December, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొట్టుంటేనే దాండియా ఆడనివ్వాలి

06-10-2024 12:46:37 AM

ఎమ్మెల్యే రాజాసింగ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : విజయ దశమి నవ రాత్రి ఉత్సవా ల్లో భాగంగా నిర్వహించే దాండియా కార్యక్రమాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాండియా కార్యక్రమాలకు బొట్టు లేకుండా వచ్చే వారిని అనుమతించకూడదంటూ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దాండియాలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, అయితే ఇతర మతానికి చెందిన వ్యక్తులు ఇదే అదునుగా వేడుల్లో పాల్గొని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించా రు.

నిర్వాహకులు..వేడుకల్లో పాల్గొనేవారి వివరాలు పరిశీలించడంతో పాటు లోపలికి వెళ్లాక దుర్గా దేవిని దర్శించుకుని, నుదుటిపై మందపాటి తిలకం పెట్టుకున్న తర్వాతే దాండియాకు అనుమతివ్వాలన్నారు. ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే సంబంధిత వ్యక్తిని బహిష్కరించాలని సూచించారు.