అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన దండనాయకుల శ్రీనివాసరావు
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధుడు దండనాయకుల శ్రీనివాసరావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు. దండ నాయకుల శ్రీనివాసరావు కుమారుడు సినీ, టెలి దర్శక నిర్మాతగా దండనాయకుల సురేష్ కుమార్ రాణిస్తుండగా, దండనాయకుల రామారావు రెవెన్యూ శాఖలో ఉద్యోగ విరమణ పొందారు.