పాతకాలంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువు ల్లో రోలు, రోకలి ఒకటి. ఇవీ ప్రతి ఇంటిలోనూ ఉండేవి. ఆ కాలంవాళ్లు మిరపకాయలు, పసుపు కొమ్ములు, నువ్వులు, ధాన్యాలు మొదలగు వాటిని రోలులో వేసి రోకలితో దంచేవారు. రోకలితో వాటిని దంచినపుడు పొడిగా తయారవుతాయి. ఈ పొడులను వాడేవారు. అయితే వీటి తర్వాత అనేక రకాలు మిక్సీలు వచ్చాయి. అప్పటికప్పుడు పోపులోకి వెల్లుల్లో, టీలోకి అల్లాన్ని పేస్ట్‌గా చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే పొడులు, పచ్చళ్ల తయారీలో రోలు, రోకలికి మించినది ఏదీ సాటిరాదంటారు మన పూర్వీకులు. అందుకే తెలంగాణలోని కొన్ని పల్లెల్లో గ్రామీణలు మహిళలు నేటికీ రోలు, రోకలి వాడుతున్న దృశ్యాలు చూడొచ్చు. మన సినీ రచయితలు వీటిపై పాటలు అల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.