calender_icon.png 23 February, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసికొల్లాసానికి నృత్యాలు ఎంతో అవసరం

22-02-2025 12:00:00 AM

బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్

బాసర ఫిబ్రవరి 21 ః సమాజంలో మనిషి మనుగడకు మానసికల్లాసానికి సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ అన్నారు శుక్రవారం రోజున క్యాంపస్ శాతవాహన గ్రౌండ్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పియుసి మొదటి సంవత్సరం విద్యార్థులకు సాంస్కృతిక సామూహిక నృత్యాలతో సందడి చేశారు

ఈ సందర్భంగా విసిగోవర్ధన్ మాట్లాడుతూ ఈ నృత్యాలతో విద్యార్థులకు సృజనాత్మకతతో పాటు మానసికల్లాసం పెంపొందుతాయని ఆయన అన్నారు ఏరోబిక్ విన్యాసాలు ఇప్ అప్ నృత్యం సంగీతానికి తోడై ఆధునిక నృత్యాన్ని క్రోడీకరించారు  విద్యార్థులు మానవారంగా ఏర్పడి త్రిబుల్ ఐటీ లోగోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మురళి దర్శన్ ఏవో రణధీర్ కౌన్సిలర్ నాగలక్ష్మి శ్రీలక్ష్మి అసోసియేట్ డీన్ సూపర్డెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.