calender_icon.png 25 October, 2024 | 4:50 AM

ప్రమాదకరంగా దన తుపాను

25-10-2024 02:35:44 AM

బెంగాల్, ఒడిశావైపు 

దూసుకొస్తున్న సైక్లోన్

రెండు రాష్ట్రాల్లో 

ఎయిర్‌పోర్టుల మూసివేత

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: తీవ్రస్థాయిలో బలపడుతోన్న దన తుపాను తీరం వైపు దూసుకొ స్తోంది. బెంగాల్, ఒడిశాలో తుపాను తీవ్ర ప్ర భావం చూపనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఏ క్షణం లోనైనా తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో 200కుపైగా రైలు సర్వీసులను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అక్టోబర్ 24 అర్ధరాత్రి దన తుపాను తీరం దాటే అవకాశముంది. శుక్రవారం ఇది తీవ్ర తుపానుగా మారనుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.