హైదరాబాద్: ఫార్ములా- ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడు ఐఏఎస్ దాన కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దాన కిషోర్ వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్, అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్, అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ కార్ రేస్‌లో అవకతవకలకు సంబంధించి తెలంగాణ మాజీ మంత్రి కెటి రామారావుపై అవినీతి కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సోమవారం కేబినెట్ క్లియరెన్స్ వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ కంపెనీ ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర మంత్రివర్గం లేదా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందకుండానే చెల్లింపులు జరిగాయని సమాచారం. అనధికార లావాదేవీల కారణంగా అప్పటి తెలంగాణ ప్రభుత్వంపై ఆర్బీఐ రూ.8 కోట్ల జరిమానా విధించగా, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని చెల్లించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా కెటి రామారావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి కూడా ఈ కేసులో చిక్కుకున్నారు.