calender_icon.png 24 October, 2024 | 4:02 AM

‘దన’ ఎఫెక్ట్.. 34 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

23-10-2024 12:00:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): దన తుఫాన్ కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 34 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. హౌరా- సికింద్రాబాద్, కామాఖ్య ఖరగ్‌పూర్- విల్లు పురం, షాలిమార్- హైదరాబాద్, సిల్చార్- సికింద్రాబాద్, సికింద్రాబాద్- భువనేశ్వర్ మార్గాల్లో 34 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. బుధ, గురువారాల్లో బయలుదేరాల్సిన ఈ రైళ్లు రద్దునట్లు ప్రయాణికులు గమనించాలని సూచించింది.