హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): దేశీయ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నూతన చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసులు శెట్టిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ కలిశారు. బొంబాయిలోని ఎస్‌బీఐ కార్యాలయంలో శనివారం ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి గ్రూప్ చైర్మన్ యెర్రం విజయ్‌కుమార్, వాసవి గ్రూప్ డైరెక్టర్లు సాయిరాజేష్, కౌశిక్, వైష్ణవి, కేసీ వెంకటేశ్వర్లు, గంథె సుధాకర్, సీఏ రాజేష్ డొంకేష్ పాల్గొన్నారు.