* రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత
అశ్వారావుపేట, డిసెంబర్ 28: పట్టా పాస్‌బుక్ మంజూరు కోసం సర్వే నిర్వహించడానికి రైతు నుంచి లంచం తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేటకు చెందిన వెంకట్ అనే రైతు తన భూమి పట్టాదారు పాసు పుస్తకం పొందేందుకు మండల సర్వేయర్ వెంకటరత్నంకు దరఖాస్తు చేసుకున్నాడు.
భూ సర్వే నిర్వహిం చేందకు రూ.1.50 లక్షలు లంచం ఇవ్వాలని వెంకటరత్నం వెంకట్‌ను డిమాండ్ చేశాడు. దీంతో వెంకట్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. వారు సూచనల మేరకు శనివారం రూ.50 వేలు సర్వేయర్‌కు ఇస్తున్న క్రమంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.