calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామరవంచ గురుకులం ఆకస్మిక తనిఖీ

05-04-2025 12:08:52 AM

ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ భూక్య పద్మ 

మహబూబాబాద్, ఏప్రిల్ 4: (విజయక్రాంతి) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలను ఆదివాసి కాంగ్రెస్ మానుకోట జిల్లా వైస్ ఛైర్మెన్ భూక్య పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిలోనికి పోయి వంట చేస్తున్న పనితీరును కూరగాయలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు పాఠాలు  మంచిగా చెప్తున్నారా లేదా అని సమయపాలన పాటిస్తున్నారా లేదా అని వాకబ్ చేశారు.

అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టపడి పిల్లలు ఉన్నత స్థితిలోకి ఎదగాలని ఉద్దేశంతో వారికి కష్టమైనప్పటికీ చదివిస్తున్నారని వారి ఆశయాలను నిలబెట్టేందుకు విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా పేరు నిలబెట్టే విధంగా విద్యార్థులు బాగా చదివి ఉపాధ్యాయులకు తమకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో గురుకుల చదివే విద్యార్థులు మంచిగా చదివి ఉన్నంత స్థానానికి ఎదగాలని వారు తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులు ఎక్కువ శాతం పేదవారే ఉండి ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు చెప్పిన పాటలు విని మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు ఆమె సూచించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల మేలు కోసం సన్న బియ్యంతో పాటు మీల్స్ చార్జీలు పెంచి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనలు ఇబ్బంది పడుతున్నారని వారికి నాణ్యమైన భోజనం ఇచ్చే ఉద్దేశంతో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్కూల్ పరిసరాలను పరిశీలించి యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ ని ఆమె అభినందించారు.