calender_icon.png 27 October, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దెబ్బతిన్న రోడ్లు.. ప్రయాణికుల పాట్లు

16-09-2024 12:02:40 AM

  1. వరదల ధాటికి కోతకు గురైన రహదారులు 
  2. జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్ల మేర నష్టం 
  3. సర్కార్ వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని ప్రయాణికుల డిమాండ్

ఖమ్మం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఖమ్మం జిల్లాలో నదులు, వాగులు, వంకలు పొంగాయి. వరదలకు కోతకు గురై పలుచో ట్ల రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో గతుకులు, గుంతలమయమైన రోడ్లపై ప్రయాణ ం ప్రయాణికులకు నరకప్రాయంగా మారిం ది. కొన్ని గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అం తరాయం ఏర్పడింది. రహదారులు దెబ్బతి ని ప్రభుత్వానికి రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అం చనా వేశారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, పాలేరు, మధిర, ఎర్రుపాలెం, చింతకా ని మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది.

పాలేరు సమీపంలోని నాయకన్‌గూడెం, ఖ మ్మం కోదాడ క్రాస్ రోడ్డు, ముదిగొండ, కోదాడ మార్గాలు మరింత అధ్వానంగా త యారయ్యాయి. వాస్తవానికి ఖమ్మం  ము దిగొండ మార్గంలోని ప్రధాన  రహదారి ఎ ప్పటి నుంచో గతుకులమయంగానే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తి గా దెబ్బతిన్నది. ఈ మార్గంలో ఎక్కువగా గ్రానైట్ రాళ్లు తరలించే లారీలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తాయి. కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయకపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఖమ్మం  నగరంలోని పలుచోట్ల అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయి.

ఇటీవల మున్నేరు వరద లు, ఖానాపురం చెరువు ముంపు కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు దె బ్బతిన్నాయి. బొక్కలగడ్డ ప్రకాశ్‌నగర్, రాజీ వ్ గృహకల్ప, వెంకటేశ్వరనగర్, మోతీనగర్ ఆర్టీసీ కాలనీ, జలగం నగర్ తదితర ప్రాంతాల్లో అంతర్గత రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఖ మ్మం సమీపంలోని ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వద్ద వరదల ధాటికి రోడ్డు  కొట్టుకుపోయింది. ఖ  మ్మం  ములకలపల్లి వెళ్లే మార్గ ంలో హైలెవల్ బ్రిడ్జి వద్ద కనెక్టివిటీ దెబ్బతిన్నది. ఖమ్మ ం  కురవి రోడ్డు కూడా దెబ్బతిన్నది. జిల్లా లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి.  

నష్టం ఇలా..

వరదల ధాటికి ఆర్‌అండ్‌బీకి పరిధిలో ని 41.98 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.  ఇది కాక మరో 8,255 కిలోమీటర్ల మేర రోడ్లు కోతకు గురయ్యా యి. ఇవి కాకుండా మరో 22 సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీకి రూ.151,69,2 0,000 మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధించి 33.78 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. శాఖ పరిధిలో మొత్తం 21 రోడ్లు వరదలకు కొట్టుకుపోయాయి.

40 సీడీ వర్స్ దెబ్బతిన్నా యి. ఇలా మొత్తం రూ.34,77,65, 000 మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తే తప్ప మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. మరమ్మతులపై సంబంధిత శాఖల అధికారులను వివరణ కోరగా  అత్యవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామన్నారు.