19-03-2025 01:09:17 AM
అరిగోస పడుతున్న చర్ల ప్రజానీకం వర్షాకాలం వచ్చిందా చుక్కలే చర్ల,వెంకటాపురం రోడ్డు దుస్థితి
చర్ల మార్చి 18(విజయ క్రాంతి) ప్రభుత్వానికి ఆదాయం పై ఉన్న మక్కువ ప్రజల కష్టాలు తీర్చడంలో లేదని మారుమూల గిరిజన ప్రాంతమైన చర్ల,వెంకటాపురం మండ లాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతోంది. తెలంగాణ--చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మండలమైన చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూ రు మండలాలకు వెళ్లే రోడ్డును చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే తెలుస్తోంది.
శిధిలమైన రోడ్లు, కుంగిన వంతెనలతో నిత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చర్ల మండలం లో ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఇసుక తవ్వకాలకు ప్రభు త్వం అనుమతించింది. మండల పరిధిలో మూడు ఇసుక రాంపులను ఏర్పాటు చేసి గోదావరి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో లారీ లు ఈ మార్గంలో వరంగల్ మీదుగా హైదరాబాద్ ప్రయాణిస్తుంటాయి.
ఇసుక లారీ లు మోతాదుకు మించి అధిక లోడుతో ఇసుకను రవాణా చేయడంతో రోడ్లు శిథిలం అవుతున్నాయి. చర్ల-- వాజేడు మార్గంలో ఎదురు కాలనీ వాగుపై తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన ఇసుక లారీల తాకిడికి కృంగిందంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పవచ్చు.
అధిక లోడును నియంత్రించే అధికారులు, సక్రమం చాటున అక్ర మంగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులను అదుపు చేయాల్సి న ఆయా శాఖల అధికారులు మామూళ్ల మత్తులో తోలుతూ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇంతటి దరిద్రపు పరిస్థితి నెల కొందని ఆయా మండలాల ప్రజలు వాపోతున్నారు. వాగుపై వంతెన కృంగిపోవడంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.
ప్రత్యామ్నాయంగా వాగులో నుంచి తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మార్గంలోనే వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే వాగులో దిగి గట్టు ఎక్కడానికి ఇబ్బందిగా ఉండటంతో బస్సు డ్రైవర్లు ప్రయాణికులు దిగి కాలినడకన వాగు గుడ్డు ఎక్కిన తర్వాత బస్సు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎలానో అలా ప్రయాణాలు సాగుతున్నాయి.
వర్షాలు ప్రారంభమైతే ఏ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని ఆయా మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, ఐటిడిఏ పిఓ రాహుల్ ప్రత్యేక దృష్టి సారించి ఎదురుకాలనీ వాగుపై వంతలన్న మరమత పనులు చేపట్టాలని, ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తున్న లారీల రవాణా పై నియంత్రణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.