calender_icon.png 17 March, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంగిన రైల్వే బ్రిడ్జి, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

17-03-2025 09:27:15 AM

హైదరాబాద్: అనకాపల్లి జిల్లాలోని విజయరామరాజుపేట(Vijayaramarajupeta) వద్ద రైల్వే వంతెన దెబ్బతిన్నది. రైల్వే వంతెన కింద నుంచి వెళ్తుండగా గడ్డర్ ను భారీ వాహనం ఢీకొట్టింది. రైల్వే వంతెన కింద నుంచి భారీ వాహనాలు వెళ్లకుండా గడ్డర్ పెట్టారు. భారీ వాహనం గడ్డర్ కు ఢీకొనడంతో రైల్వే ట్రాక్ దెబ్బతినింది. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో గమనించిన గూడ్స్ రైలు డ్రైవర్ ట్రైన్ ను నిలిపివేశాడు. దీంతో విజయవాడ(Vijayawada) వైపు నుంచి విశాఖ వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో ట్రాక్ మీదుగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. యథావిధిగా విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. కానీ  గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ సేవలు నిలిచిపోయాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోగా, ఎలమంచిలి వద్ద మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ ఆగిపోయింది. దెబ్బతిన్న రైల్వేట్రాక్ కు సిబ్బంది మర మత్తులు చేస్తున్నారు.