16-02-2025 12:00:00 AM
గంటల తరబడి వర్కవుట్స్ చేయలేకపోయినా మినీ వర్కవుట్స్‌తో కాసింతయినా ఉపశమనం, చురుకుదనం వస్తుంది. ఏమీ చేయకుండా ఉండే బదులు మినీ వర్కవుట్స్ మంచిదే అంటున్నారు కొందరు నిపుణులు. కనీసం రోజూ 150 నిమిషాలు ఏరోబిక్స్ యాక్టివిటీ చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలుంటాయని అమెరికాలోని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ శాస్త్రవేత్తలంటున్నారు. ఉదయం లేస్తూ నే జిమ్‌లో కసరత్తులు గంటలపాటు చేసేవారుంటారు. అయితే బిజీ ఉండేవారు మాత్రం మినీ వర్కవుట్స్‌ను ఆశ్రయించవచ్చు. అంటే ఐదు లేదా పది నిమిషాలు ఫర్‌ఫెక్ట్‌గా నిపుణుల సమక్షంలో వర్కవుట్స్ చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉండటంతోపాటు రోజును ఎనర్జీగా ప్రారంభించవచ్చు. ఆరోగ్యకరమైన జీవక్రియలతోపాటు క్యాలరీస్ బర్న్ అయి బరువు కూడా తగ్గవచ్చు. డంబెల్స్ సాయంతో రోజూ పది నిమిషాలపాటు కసరత్తులు చేస్తే మాత్రం కొవ్వు కరిగిపోతుంది. జీవక్రియ సాఫీ అవుతుంది. కండరాల్లో బలం పెరుగుతుంది. దాంతో శరీరంలో చురుకుదనం పెరిగి, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నిద్ర సాఫీగా పడుతుంది. మినీ వర్కవుట్స్ నిదానంగా, క్లారిటీగా చేయా లి. బరువు తగ్గడం, మజిల్ టోన్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్యాపీ హార్మోన్లు విడుదల కావడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.