calender_icon.png 28 October, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ పైప్‌లైన్ ధ్వంసం

28-10-2024 12:22:55 AM

పోలీసులకు జలమండలి అధికారుల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27(విజయక్రాంతి): ఓఅండ్‌ఎం డివిజన్ మణికొండ సెక్షన్‌లో గల 500 ఎంఎండయా డీఐ వాటర్ మెయిన్ పైప్‌లైన్ ధ్వంసానికి కారణమైన నస్రీన్ అనే వ్యక్తిపై జలమండలి స్థానిక మేనేజర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఇంటికి సీవరేజీ కనెక్షన్ కోసం చేపట్టిన పనుల వల్లే ఇది జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌హెచ్‌వోను కోరారు. దీంతో పైప్‌లైన్ లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతోందని, దాదాపు 820 ఇళ్లకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. గండిపేట్ తహసీల్దార్ ఆఫీస్ తదితర ప్రాంతాలకు ఈ పైప్‌లైన్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుందని అధికారులు చెప్పారు.