మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ముక్కుసూటిగా మాట్లాడే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి హైడ్రాపై తన అసంతృప్తిని తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా వలన హైదరాబాద్‌కు నష్టమే అని కుండుబద్దలు కొట్టారు.
అలాగే నేను న్యాయవాదిని కాదని.. కేటీఆర్‌కు నేనేమీ క్లీన్‌చీట్ ఇవ్వట్లేదన్నారు. ఫార్ములా ఈథుబౌరేస్ తప్పు అని సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడలేదన్నారు. హైదరాబాద్‌కు మైట్రోరైలు, ఓఆర్‌ఆర్, మల్టీనేషనల్ కంపెనీలు సైతం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చాయన్నారు.
బీజేపీ నిర్వహించిన మూసీనిద్ర ఒక డ్రామా అని దానం నాగేందర్ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు మైలేజీ కోసమే మూసీనిద్ర చేపట్టారన్నారు. మూసీ సుందరీకరణ ఎప్పటికైనా జరగాల్సిందే అని దానం నాగేందర్ అన్నారు.