calender_icon.png 28 December, 2024 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ అనుమతితో నష్ట పరిహారం

08-11-2024 12:06:03 AM

-భూ నిర్వాసితులతో సింగరేణి జీఎం 

రామగుండం, నవంబర్ 7: ప్రభుత్వ అనుమతితో భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లిస్తామని సింగరేణి ఆర్జీ జీఎం లలిత్ కుమార్ అన్నారు. గురువారం ఆర్జీ జీఎం కార్యాలయంలో రామగిరి మండలం సుందిళ్ల భూ నిర్వాసితులు, రైతులతో జీఎం లలిత్‌కుమార్ సమావేశమయ్యారు. 3200 సర్వే నంబర్లు మోక మీద ఉన్నవాళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు కోరారు. జీఎం మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కలెక్టర్ అనుమతితో 10 మందితో కలిసి కమిటీ వేస్తామని, ఆ కమిటీలో గ్రామస్థులు ఆరుగురు, రెవెన్యూ సిబ్బంది ఇద్దరు, సింగరేణి అధికారులు ఇద్దరు ఉంటారని చెప్పారు. ఈ కమిటీతో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి మైనింగ్‌ను ఆపడం సబబు కాదని, ప్రభుత్వ అనుమతితో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.