calender_icon.png 31 October, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దల్జీత్‌కు కెనడా దాసోహం

16-07-2024 02:10:30 AM

  • చరిత్ర సృస్టించిన పంజాబీ సింగర్ దల్జీత్ దోసాంజ్ 
  • కెనడాలోని రోజర్స్ సెంటర్‌లో 50వేల అభిమానుల మధ్య ప్రదర్శన 
  • స్వయంగా హాజరై అభినందించిన ప్రధాని

న్యూ ఢిల్లీ, జూలై 15: దల్జీత్ దోసాంజ్ కెనడాను ఊపేస్తున్నాడు. టోరంటోలో అతడి షోకు దాదాపు 50వేల వరకు ప్రేక్షకులు అటెండ్ అవ్వడం ఇప్పడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అతడి ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను సోమవారం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. కెనడా ప్రధానమంత్రి ట్రూడో.. దల్జీత్ షోకు ప్రత్యక్షంగా హాజరవ్వడంతో పాటు దిల్జీత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే దిల్జీత్ టీమ్‌తో కూడా మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. ఇదే వీడియోలో దిల్జీత్ టీం సభ్యుల మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ‘పంజాబీ ఆగయే ఓయే’ అని టీమ్ మొత్తం గట్టిగా చెప్పడంతో స్టేడియం దద్దరిల్లింది. దిల్జీత్ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం కెనడా బలం అని అన్నారు.