06-02-2025 01:42:18 AM
మాజీ మంత్రి మోత్కుపల్లి, టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి
ముషీరాబాద్, ఫిబ్రవరి 5: వర్గీకరణ ద్వారానే దళితులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు, వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదిగల ఎన్నో ఏళ్ల కళను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాకారం చేశారన్నారు.