ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): దళితులంటే ఆది హిందువులని, దేశానికి మూల పురుషులుగా, హిందూ ధర్మ పరిరక్షకులని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నా రు. రామాయనాన్ని రచించిన వాల్మీకి, భగవద్గీతకు సమానమైన భారత రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శమని చెప్పారు.
నిజామాబాద్ బీజే పీ కార్యాలయంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత మేధావులు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో అంబేద్కర్ పేరుమీద రెండు ఎకరాల్లో రూ.100 కోట్లతో స్మారక భవనం నిర్మించామని తెలిపారు.
కొన్ని పార్టీలు దళితుల్ని ఓటు బ్యాం కులుగా వాడుకుని వదిలేస్తున్నాయని, బీఆర్‌ఎస్ దళిత ముఖ్యమంత్రి అంటు మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సైత ం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో మోసం చేసి ందన్నారు.
దళిత మేధావులందరు ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, కార్పొరేటర్లు సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, ఎస్సీ మోర్చా నాయకులు సందీప్, సాయినాథ్, కిరణ్ పాల్గొన్నారు.