calender_icon.png 23 April, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎస్సీలో ప్రతిభ చాటిన దళిత యువకుడు

22-04-2025 11:15:42 PM

949 ర్యాంకు సాధించిన రాం టెంకి సుధాకర్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కౌటాల మండలం బోదంపల్లి గ్రామంలోని రాం టెంకీ సోమయ్య-ప్రమీల దంపతుల కుమారుడు సుధాకర్ మంగళవారం యూపీఎస్సీ ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచాడు. ఆల్ ఇండియా స్థాయిలో 949 ర్యాంక్ సాధించారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హైదరాబాద్ గౌరీ దొడ్డి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన కారగ్ పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. 2017 సంవత్సరంలో ఎమ్మెస్సీ కెమికల్ పూర్తి చేశాడు. 2018 సంవత్సరం నుండి యుపిఎస్సికి సన్నద్ధం అవుతున్నాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సుధాకర్ చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఎంతో కష్టపడి చదివి యుపిఎస్సి ర్యాంక్ సాధించడంతో బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.