25 May, 2026 | 2:40 AM

చిట్యాల సాయన్నకు దళితరత్న అవార్డు

25-05-2026 01:40 AM

రవీంద్ర భారతిలో ప్రధానం 

కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కామారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చిట్యాల సాయన్నకు దళిత రత్న అవార్డును ప్రధానం చేశారు. మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎన్.రమేష్ కుమార్ సంవత్సరంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ను దళితరత్న అవార్డుతో సన్మానించారు. ఈ సందర్భంగా చిట్యాల సాయన్న మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాటం చేపట్టడం వల్ల దళిత రత్న అవార్డు రావడం మరింత పోరాట స్ఫూర్తిని నింపింది అన్నారు.