10-04-2025 01:07:14 PM
కరపత్రం విడుదల చేసిన దళిత సంఘాల నాయకులు
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండల కేంద్రంలో ఈనెల 14వ తేదీన జరుప తలపెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఉత్సవాల కరపత్రం విడుదల చేశారు. పట్టణంలోని విశ్రాంతి భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని, దీనిలో అంబేద్కర్ సామాజిక సేవ చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని, అనంతరం జెండా ఆవిష్కరణ ,బహిరంగ సభ, ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా మండల నాయకులు మేస సతీష్ ,నేత శ్యామ్, కావలి సంతోష్,దాసరి రాజన్న, తాళ్లపల్లి రాజ గంగన్న, గొర్రె గంగాధర్, దేవతి రాజేశ్వర్ ,ప్రణీత్ ,రాజేశ్వర్,గోవింద్, సుద్దాల మహిపాల్ ,పండుగ పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.