calender_icon.png 23 March, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంగ్లూర్‌లో సినీ ఫక్కీలో గుండాయిజం

22-03-2025 11:05:54 PM

వేట కొడవలతోహత్య ప్రయత్నం  

బీఆర్ఎస్ జిల్లా నాయకుడి పై అతని కొడుకును కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం

భూమి అమ్మాలి.. కేసు వీడ్రా చేసుకోకుంటే కుటుంబాన్నే చంపేస్తాం  

మేడికొండ మురళి కృష్ణ ఆగడాలు అంత ఇంత కాదు...

ఇప్పటికే అట్రాసిటీ కేసులతోపాటు హత్య నేరం కేసులు సైతం.

తాజాగా  కళ్ళల్లో కారం చల్లి కత్తులతో దాడులు 

దళిత మంత్రి నియోజకవర్గంలో దళిత నాయకుడు పై పట్టపగలే అత్యాయత్నం

ఆందోల్: నరసింహనాయుడు సినిమా నిర్మాత తాటికొండ వెంకట మురళీకృష్ణ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తనకున్న అర్థబలం అంగ బలంతో పాటు స్థానిక అధికారుల సహకారంతో ఆయన విలన్ అవతారం ఎత్తారు. అమాయకులైన రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను కౌలు పేరుతో తీసుకుని ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా పట్టా చేసుకుంటున్నారు. కొన్ని సందర్భంలో అయితే తనకు సంబంధించిన భూమికి ఆనుకొని ఉన్న  రైతుల భూములను కౌలుకు ఇవ్వాలని, అంత కాదంటే మొత్తానికి అమ్మాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దానికి అంగీకరించని పక్షంలో సదరు రైతులను బెదిరింపులకు పాల్పడేందుకు గాను ముందుగా దాడులు చేయించడం... కత్తులతో పొడవడం ఆయనకు పొరపాటుగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య సతీమణి పల్లె సరోజ కు  సర్వే నెంబర్ 794లో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఎకరా 20 గుంటల భూమిని హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి ఇటీవల విక్రయించాడు. దీంతో వెంకట మురళీకృష్ణ  తనకు భూమిని అమ్మకుండా ఇతరులకు అమ్మడంను జీర్ణించుకోలేక  ఎలాగైనా సంజీవయ్య భూమిని కొనుక్కోవడం కోసం చేయండి ప్రయత్నాలు అంటూ లేవు. దీంతో   అతను ఎంతకు వినకపోవడంతో  ఇటీవల విక్రయించిన భూమికి హద్దులు పాతెందుకు గాను  పల్లె సంజీవ కు సంబంధించిన వ్యక్తులు వెళ్లగా మురళీకృష్ణ మనసులు  వారి పనులను అడ్డుకోవడం కాకుండా వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న సంజీవయ్య, అతని తమ్ముడు బాలయ్య, పెద్ద కుమారుడు క్రాంతి కిరణ్ చేను వద్దకు వెళ్లగా  అక్కడ ఉన్న మురళీకృష్ణ సంబంధించిన కిరాయి గుండాలు  కాపు కాశి సంజీవయ్య తమ్ముడు బాలయ్య కంట్లో కారం చల్లారు.

ఇదే సందర్భంలో సంజీవ సెల్ఫోన్లో ఫోటో తీస్తుండగా అతన్నీ నెట్టివేయడంమే కాకుండా సంజీవయ్య కుమారుడు క్రాంతి కుమారున్ని కాళ్లు చేతులు కట్టేసి కళ్ళల్లో కారం చల్లి ఆటోల వేసుకొని సింగూరు ప్రాజెక్టులో పడేసేందుకు వెళ్లగా  స్థానికులు గమనించి జోగిపేట సిఐ కి సమాచారం. దీంతో స్పందించిన సీఐ అనిల్ కుమార్  వెంకట మురళీకృష్ణ కు ఫోన్ చేసి  నీకు సంబంధించిన వ్యక్తులు పల్లె సంజీవయ్య కుమారుడిని కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళుతున్నట్లుగా తనకు సమాచారం వచ్చిందని.. వెంటనే సంజీవయ్య ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారో అక్కడ వదిలి పెట్టాలంటూ  మురళి కృష్ణకు సూచించారు. దీంతో చేసేదేమీ లేక కిడ్నాప్ చేసిన క్రాంతికుమార్ ను గొంగులూరు లోని తన పొలం వద్ద వదిలిపెట్టారు. విషయం గ్రామంలో తెలవడంతో గ్రామస్తులు అంత  పల్లె సంజీవయ్య తో పాటు అతని తమ్ముడు కొడుకు పై దాడి చేసిన వ్యక్తులను పట్టుకొని చితక కొట్టారు. హుటా కొట్టిన జోగిపేట సిఐ అనిల్ తో పాటు పుల్కల్ ఎస్సై క్రాంతి సంఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 తమకు రక్షణ కల్పించాలి..

 గుండ్లూరు గ్రామంలో రౌడీయిజం చెలాయిస్తున్న వెంకట మురళీకృష్ణ పై పోలీసులు తగు చర్య తీసుకుని గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని బాధితుడు పల్లె సంజీవయ్య డిమాండ్ చేశారు. తాటికొండ వెంకట మురళి కృష్ణ పై ఇప్పటికే 16 కేసులు ఉన్నాయని.. అందులో రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు  పలు హత్య ప్రయత్నం కేసులు సైతం ఉన్నాయన్నారు. చేసుకోవడానికి చెందిన మంత్రి దామోదర్ రాజనర్సింహ మురళీకృష్ణ వ్యవహారంలో జోక్యం చేసుకొని  తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. బలవంతంగా భూములు అమ్మాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి సమగ్ర న్యాయ విచారణ జరిపి ఎక్కువమంది దళితులే ఉన్నందున న్యాయం చేయాలని పేర్కొన్నారు.