calender_icon.png 2 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణకు దళితుల భూములు!

02-02-2025 01:57:38 AM

* మనస్తాపంతో ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

* పోలీసుల పహారా మధ్య సర్వే చేసిన అధికారులు

* నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులో ఘటన

నాగర్‌కర్నూల్,  ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జాతీయ రహదారి 167 విస్తరణ పనుల్లో భాగంగా భూసేకరణ చేసే క్రమంలో ఉన్నత వర్గాల వారి భూములను తప్పించి వారి మెప్పుకోసం దళితుల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని నిరసి  ఇద్దరు దళిత రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనతో నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులో శనివారం తీవ్రఉద్రిక్తత చోటుచేసుకుంది.

దీంతో పోలీసులు భారీగా మోహరించి రైతులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి మీదుగా సోమశిలెొద్ధేశ్వరం 167 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శనివారం తాడూరుమం  కేంద్ర శివారు ప్రాంతంలో అధికారులు భూసేకరణ పనులు చేపట్టారు.

సర్వే నెంబర్ 120లో నాలుగు ఎకరాలు, 126లో 2 ఎకరాలు రహదారి నిర్మాణంలో దళిత రైతుల భూములనే సేకరిస్తున్నారని అంతకు ముందు ఉన్నతవర్గాలకు చెందిన భూములను సర్వే చేశారని, వారి మెప్పు కోసమే తమ భూములను లాక్కునే  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సాగు భూములను లాక్కుంటే బతికేదెలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అధికారులు వినకుండా మిర్చి పంటలో సర్వే పనులు చేపట్టారు. సర్వేనంబర్ 120కి చెందిన రైతు మంచెల శేకర్(38) మనస్తాపంతో పురుగుల మందు తాగి సూసైడ్‌కు యత్నించాడు.

అతడితో పాటు సర్వే నంబర్ 126లోని హక్కుదారు కురుమూర్తి (40) అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన అక్కడి అధికారులు వారిని నిలువరించి 108 సాయంతో జిల్లా జనరల్ దవాఖానకు తరలించించారు.

విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీ ఎం, ఇతర ప్రజాసంఘాల నేతలు రైతులను పరామర్శించి, మద్దతు తెలుపుతూ దళిత రైతులకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని సర్వే పనులు నిలిపి పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.