06-04-2025 12:00:00 AM
శ్రీ సాత్విక్ డెవలపర్స్ అధినేత ఆలూరి సుబ్బారావు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబు జగ్జీవన్‌రామ్ అని శ్రీ సాత్విక్ డెవలపర్స్ అధినేత ఆలూరి సుబ్బారావు అన్నారు. శనివారం జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ఆయన ఆశయ సాధనలను పునికి పుచ్చుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడేలా తయారవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.