పాట్నా, సెప్టెంబర్ 19: బీహార్‌లో భూవివాదంలో ఓ దళిత గ్రామాన్ని దుండగులు కాల్చి బూడిద చేశారు. నవాడా జిల్లాలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకొన్నది. చీక ట్లో గ్రామంలోకి దూసుకొచ్చిన దుం డగులు కనిపించినవారిపై దాడిచే శారు. అనంతరం ఇండ్లకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో గ్రామంలోని ౮౦ ఇండ్లు పూర్తిగా కాలిపోయాయని మీడియా పేర్కొనగా, 21 తగులబడ్డాయని పోలీసులు తెలిపారు. దుండగు లు కాల్పులు కూడా జరిపారని స్థానికులు తెలుపగా, ఆనవాళ్లేవీ దొరకలే దని ఎస్పీ అభినవ్ ధిమాన్ తెలిపారు. దీంతో రాజకీయ దుమారం రేగటం తో సీఎం నితీశ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.