calender_icon.png 28 October, 2024 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి

13-07-2024 04:49:21 AM

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వీహెచ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం కీసర దాయర రెవెన్యూ పరిధిలో దళితుల భూములను తప్పుడు పత్రా లతో ఆక్రమించి విక్రయించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ గౌతమ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.. 1981లో కేంద్ర ప్రభుత్వం కీసర గ్రామంలో 10 మంది దళిత కుటుంబాలకు 94ఎకరాల భూ పంపిణీ జరిగిందన్నారు.

ప్రభుత్వం నుంచి 38ఈ పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేర్లపై ఆ భూమిని తహసీల్దార్ కార్యాలయ రికార్డుల్లో చేర్చుకున్నా డని ఆరోపించారు. 2006 నుంచి కీసర దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో రికార్డులను మార్చిన కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, రియల్టర్లతో కుమ్మక్కై అమ్ముకున్నారని వివరిం చారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరా రు. ఆయనవెంట పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ రమేష్, పీసీసీ కార్యదర్శి అఫ్సర్ యూసుఫ్ జాహి ఉన్నారు.